25-07-2025 12:13:11 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. 12,055 ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగి ంచింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేఏడాది మార్చి 31 వరకు వారి సేవలను పొడగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సేవల పొడగింపు జరగకపోవడంతో సాంకేతిక కారణాలతో వారి జీతాలు ఆగిపోయాయి. జీవో జారీతో ఆ ఉద్యోగుల మూడు నెలల పెండింగ్ జీతాల ప్రాసెసింగ్ పూర్తుంది నిధులు ఆర్థిక శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు చేరాయి.