11-09-2025 12:54:51 AM
అలంపూర్ సెప్టెంబర్ 10 దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయాల దర్శనానికి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయడు ఆలయ అధికారులకు సూచించారు.
బుధవా రం ఎమ్మెల్యే జోగుళాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ఆవరణలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఈవో దీప్తి , తదితరులు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు
బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని అలంపూర్ పట్టణ కేంద్రం లో ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే విజయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చాకలి ఐలమ్మ కీర్తిని కొనియాడారు. ఎమ్మెల్యే వెంట నాయకులు శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు