30-08-2025 01:28:21 AM
- యూరియా పంపిణీలో చిన్న అవకతవకలు జరిగినా స్పాట్ లో సస్పెండ్
- కూసుమంచి క్యాంపు కార్యాలయంలో యూరియా సరఫరాపై సమీక్షించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, ఆగస్టు 29 (విజయ క్రాంతి): పాలేరు నియోజకవర్గం పరిధిలో ఇక నుంచి ప్యాక్స్ కేంద్రాల ద్వారా మాత్రమే రైతులకు యూరియా సరఫరా జరగాలని రాష్ట్ర రెవె న్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధా ల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.మంత్రి, శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి యూరియా సరఫరా పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రి ల్ నెల నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన స్థాయిలో యూరి యా సరఫరా చేయని కారణంగా కొంత యూరియా కొరత మన రాష్ట్రంలో ఉందని అన్నారు. రామగుండం ఆర్.ఎఫ్.సి.ఎల్. ఉత్పత్తి సాంకేతిక సమస్యల వల్ల నిలిచి పో యిందని అన్నారు. ఖమ్మం జిల్లాకు రాబో యే 7 రోజులలో 1600 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ వస్తుందని అన్నారు. పాలే రు నియోజకవర్గ పరిధిలో ప్యాక్స్ సోసైటిల ద్వారా మాత్రమే రైతులకు యూరియా అం దేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
యూరియా అక్రమ రవాణాను అరిక ట్టాలని అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా క్రమ పద్ధతిలో రైతులకు యూరియా పంపి ణీ చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. యూరియా పంపిణీలో ఎటు వంటి తప్పులు జరగరాదని అన్నారు. గత సంవత్సరం కంటే ఎక్కువ యూరియా అ మ్మినట్లు రిపోర్టు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సమస్య ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. మంత్రి ఆదేశాలు మేరకు పాలేరు నియోజకవర్గం పరిధిలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఇక నుంచి ప్యాక్స్ ద్వారా మాత్రమే యూరియా పంపిణీకి ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
పాలేరు నియోజకవర్గ పరిధిలో ప్రతి ప్యాక్ సొసైటీ పరిధిలో అవసరమైన మేర సబ్ సెంటర్లను అదనంగా ఏర్పాటు చేసి పారదర్శకంగా యూరియా పంపిణీకి చర్య లు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ప్రతి సబ్ సెంటర్ పరిధిలో ఉన్న భూమికి తగ్గట్లుగా అవసరమైన ఎరువుల స్టాక్ అందుబాటులో పెట్టాలని, పోలీ సుల భద్రతతో ఎకరానికి ఒక బ్యాగ్ చొ ప్పున రైతులు ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు పరిశీలించి నేరుగా యూ రియా పంపిణీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతర అవసరాలకు యూరియా డైవర్ట్ కావడానికి వీలు లేదని కలెక్టర్ అన్నారు. ఈ స మావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఖమ్మం, ఆగస్ట్ 29 (విజయ క్రాంతి): పేదల సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కూసుమం చి మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించి, పిఎస్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు షూస్, రెండు జతల సాక్స్ పంపిణీ చేసారు.
ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ గతంలో ఉన్న బీటీ రోడ్డు గత సంవత్సరం వచ్చిన వరదలో కొ ట్టుకొని పోయిందని, కోటి 22 లక్షలతో పాలేరు పిడబ్ల్యుడి రోడ్డు నుంచి హట్యాతం డా వరకు బీటీ రోడ్డు మరమ్మతుల పునరుద్ధరణకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నా రు. గతంలో వరదలకు దెబ్బతిన్న కాలువ లు, రోడ్ల మరమ్మత్తు పనులు, అంతర్గత సీసీ రోడ్డు, పశు వైద్యశాల, త్రాగునీటి సరఫరా పనులు, లింక్ కెనాల్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. టెండర్ ప్రక్రియ త్వరగా ముగించి అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.
మల్లాయిగూడెం నుంచి భగత్ వీడు వరకు రూ. 3 కోట్ల 30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, గతంలో రూ. 45 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు ని ర్మించామని, త్రాగునీటి సమస్యలు పరిష్కరించామని తెలిపారు. లింగారంతండాలో రూ. 20 లక్షల రూపాయలతో చేపట్టిన గ్రా మ పంచాయతీ భవనం ప్రారంభించామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత లింగారాం తండా, గన్యా తండా వేరు వేరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చా రు. గ్రామ పంచాయతీ భవనానికి ప్రహరీ గోడ, అంగన్వాడీ భవనం త్వరలో మంజూ రు చేస్తామని అన్నారు. జీళ్ల చెరువు గ్రామం లో రూ. 2 కోట్ల 25 లక్షలతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రోడ్డు నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఉన్న ఘాట్ రోడ్డు, రూ. 20 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు.
జీళ్ళ చెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం డబుల్ లైన్ రోడ్డు, సైడ్ డ్రైయిన్లతో అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా డిజై న్ చేశామని, ఈ రోడ్డు త్వరగా పూర్తి చేసి ఆలయానికి వచ్చే భక్తులకు ఉపయోగంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పేదల సొంతింటి నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షలు ఇండ్లు మంజూరు చేశామని, ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 3500 పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, 4 విడతల్లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తు న్నామని, ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల డబ్బు లు విడుదల చేస్తున్నామని తెలిపారు.
రాబో యే రోజులలో అర్హులైన పేదలందరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తా మని అన్నారు. సంక్షేమ హాస్టల్స్ లో చదివే పిల్లలకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శా తం కాస్మొటిక్ చార్జెస్ పెంచడం జరిగిందని అన్నారు. అనంతరం కూసుమంచి మండ లం జీళ్లచెరువు ఎం.పి.పి.ఎస్. పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో షూస్, రెండు జతల సాక్స్ లను మంత్రి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్‌ఈ యాకోబు, డిప్యూటీ సిఈఓ నాగపద్మజ, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమే ష్, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.