calender_icon.png 30 August, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇవి తింటే ‘గుడ్లు’ తేలేయడమే!

30-08-2025 01:29:31 AM

బూర్గంపాడు, ఆగస్టు29,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పాడు మండలం సారపాకలోని మసీదు రోడ్డులో గల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాడైన గుడ్లు ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఆరోపించారు. చిన్నారుల ఆరోగ్యా నికి ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వంట చేసే వారిని అడిగితే దురుసుగా సమాధానం ఇస్తున్నారని ,దీం తో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వంట చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొత్త వారిని నియమించాలని డి మాండ్ చేశారు.విషయం తెలుసుకున్న మం డల విద్యాశాఖ అధికారి యదు సింహరాజు పాఠశాలకు చేరుకొని పూర్తి విచారణ జరిపి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆకస్మిక తనిఖీ చేస్తామని విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.