calender_icon.png 4 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటి టవర్‌కు అడుగులు

13-02-2025 12:57:04 AM

వనపర్తి, ఫిబ్రవరి 12 ( విజయక్రాంతి ) :  వనపర్తి జిల్లాకు రాష్ర్ట ప్రభుత్వం ఐ టి టవర్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయ డం జరిగిందని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

వన పర్తి లో విద్యభాసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వనపర్తి జిల్లాపై ప్రత్యేక అభి మానంతో ఐటి టవర్ మంజూరు చేయడం తో పాటు రూ 22 కోట్ల ను విడుదల చేస్తూ జివోను మంజూరు చేయడం జరిగిందన్నారు.ఈ ఐటి టవర్  నిర్మాణంతో ఉన్నచదు వులు అభ్యసించిన విద్యార్థులకు స్థానికంగా ఉపాధి కల్పన జరుగుతుందని, దేశ విదే శాలకు వనపర్తి కీర్తి తెలియజేసిందుకు ఈ ఐటి టవర్ ఎంత గానో ఉపయోగ పడు తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

హైట్ టవర్ వచ్చేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, అబ్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, నాగర్ క ర్నూల్ ఎంపీ మల్లు రవి లకు వనపర్తి నియో జకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.