13-09-2025 01:32:00 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 12)విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, వాటి బలోపేతానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రు.14 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 19 లక్షలతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, జగిత్యాల పట్టణంలో 12వ వార్డులో పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చల్గల్ లో రు.200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయటం జరిగిందని,అదేవిధంగా 10 ఎకరాలలో ఇండోర్ స్టేడియం మంజూరుకు తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చా రు.కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, తహసిల్దార్ వరంధన్, ఎంపీఓ రవి బాబు, ఏం ఈ ఓ గంగాధర్,మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి,మాజీ ఏఎంసి ఛైర్మెన్ లు దామోదర్ రావు,నక్కల రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ పెండెం రాములు,బాల ముకుందం, తదితరులుపాల్గొన్నారు.