calender_icon.png 13 September, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

13-09-2025 01:33:37 AM

  1. పెండింగ్ బకాయిలు రూ. 15 కోట్లు విడుదల
  2. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పా రు. అందులో భాగంగానే పెండింగ్ బకాయిలు రూ. 15 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ఉద్యోగులను విస్మరించిందన్నారు.    సంక్షేమ శాఖ లోని ఉద్యోగుల, గురుకులాల విద్యార్థుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగానే వెల్ఫేర్ హాస్టల్స్‌కు స్పెషల్ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్‌ను నియమించారని తెలిపారు.

టీజీడబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్‌సోర్స్, పార్ట్‌టైమ్ సిబ్బందికి, సబ్జెక్ట్ అసోసియేట్స్, హెడ్ ఆఫీస్‌లో పనిచేస్తున్న సిబ్బందికి, స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు సంబంధించి రెమ్యునరేష న్, సర్వీస్ చార్జీలు విడుదల చేసినట్టు వివరించారు. జూలై, ఆగస్టు-2025 నెలలకు  కాంట్రాక్టు, ఔట్‌సోర్స్, పార్ట్‌టైమ్ సిబ్బందికి వేతనాల కోసం రూ.11.53 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 18 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.  గురుకులాలపై ప్రతిపక్షాలు  సూచనలివ్వాలని కోరారు.

ఆధారాలు ఉంటే బయటపెట్టాలి

  గ్రూప్-1 విషయంలో ఆధారాలు ఉంటే బయటపెట్టాలని మంత్రి సవాల్ చేశారు. పిల్లల భవిష్యత్ విషయంలో తప్పు చేయబోమని స్పష్టం చేశారు.  నియోజకవర్గాల్లో  యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, షేక్ పేట, ధర్మపురిల్లో రూ.24 లక్షలతో మోడ్రన్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టినట్టు వివరించారు.