calender_icon.png 23 August, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టెరిలైజ్ చేసి వదిలేయండి

23-08-2025 12:46:52 AM

  1. వీధి కుక్కల విషయంలో తీర్పును సవరించిన సుప్రీం
  2. రేబిస్ లక్షణాలున్న కుక్కలనే షెల్టర్లలో ఉంచాలి
  3. వీధి కుక్కలకు బహిరంగంగా ఎవరూ ఆహారం అందిచకూడదు
  4. ఆహారం కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
  5. గత తీర్పును సవాల్ చేసిన పలువురు వ్యక్తులు, పలు ఎన్జీవోలు
  6. వ్యక్తులైతే రూ. 25 వేలు, ఎన్జీవోలు రూ. 2 లక్షలు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలన్న సుప్రీం 
  7. తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 22: వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందించొద్దని సుప్రీం ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసిం ది. ఇలా ఎక్కడపడితే అక్కడ ఆహారం అం దించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి ఎక్కడినుంచి తీసుకె ళ్లారో.. మళ్లీ అక్కడే విడిచిపెట్టాలని ఆదేశాలిచ్చింది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని 11వ తేదీన జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎనిమిది వారాల్లో రాజధానిలో ఉన్న అన్ని కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశాలిచ్చింది. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా నిరస నలు వ్యక్తం అవడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆంశంపై పునర్విచారణ జరిపేం దుకు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడి న త్రిసభ్య ధర్మాసనాన్ని నియమించింది.

శు క్రవారం తీర్పు వెలువరించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘వీధికుక్కలకు ఆహారం అందించేందుకు ప్రతి వార్డులో ప్రత్యేక కేం ద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు బోర్డు లు ఏర్పాటు చేయాలి. కేవలం రేబిస్ లక్షణా లు, దూకుడుగా ఉండే కు క్కలను మాత్రమే షెల్టర్లలో ఉంచి.. మిగతా వాటిని వదిలిపెట్టాలి. బహిరంగంగా ఆహారం పెడితే చట్టప రమైన చర్యలు తీసుకోవాలి.

సుప్రీం గత తీ ర్పును సవాలు చేసిన వ్య క్తులు, ఎన్జీవోలు రూ. 25 వేలు, రూ. 2 లక్ష లు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలి’ అని పేర్కొంది. సుప్రీం తీర్పుపై జంతు ప్రేమికు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. 

సుప్రీం కోర్టు తీర్పు ముఖ్యాంశాలు.. 

1) పురపాలక సంఘాలు తప్పనిసరిగా కుక్కలకు ఆహారం అందించే ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఆహారం పెట్టేందుకు వీల్లేదు. అలా చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయి. 

2) ఈ ఉత్తర్వులు కేవలం దేశ రాజధాని ప్రాంతానికే పరిమితం చేయలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ ఆదేశాలు వర్తించేలా రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. 

3) గత ఉత్తర్వులకు భిన్నంగా శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. వీధి కుక్కలకు వ్యాక్సిన్స్ వేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడే వదిలిపెట్టాలని సూచించింది. రేబిస్ లక్షణాలు లేదా దూకుడుగా ఉండే కుక్కలను మాత్రమే ప్రత్యేక షెల్టర్లలో ఉంచాలంది. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయకుండా వీధుల్లో ఉండే అన్ని కుక్కలను షెల్టర్లకు తరలించాలనే ఉత్తర్వులు, సమంజసం కాదని, ఆ ఆదేశాలను పాటించడం కూడా సాధ్యం కాకపోవచ్చునని ధర్మాసనం అభిప్రాయపడింది. 

4) జంతుప్రేమికులు కుక్కలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దత్తత తీసుకున్న కుక్కలు వీధుల్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. 

5) ఏ వ్యక్తి లేదా సంస్థ అధికారుల విధులకు ఆటంకం కలిగించరాదు. గత తీర్పును సవాలు చేసిన డాగ్ లవర్స్, ఎన్జీవోలు రూ. 25 వేలు, రూ. 2 లక్షల చొప్పున రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలి. లేని పక్షంలో ఈ కేసులో ఇకపై వారు హాజరయ్యేందుకు అనుమతించమని హెచ్చరించింది.