calender_icon.png 16 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకా దొరకని ఆచూకీ

16-09-2025 01:16:30 AM

-హైదరాబాద్‌లో వరదలో గల్లంతైన ముగ్గురు

-ముమ్మర గాలింపు చేపట్టిన హైడ్రా, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ 

-బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం

-కలెక్టర్ హరిచందన

ముషీరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాం తి): హైదరాబాద్‌లో ఆదివారం కురిసిన వాన కు వరదలో ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కోసం సోమవారం హై డ్రా, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ విస్తృంగా గాలించినా లభించలేదు. కాగా బాధిత కుటుంబాల కు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు. ఆసిఫ్ నగర్ మంగార్ బస్తీలో మల్లేపల్లి అఫ్జల్ సాగర్ నాలాలో రాము, అర్జున్ (26), ముషీరాబాద్ వినోబానగర్‌లో దినేష్ (సన్నీ) (24)  గల్లంతయ్యారు.

సన్నీకి భార్య రాజశ్రీ, మూడు సంవ త్సరాల కొడుకు కార్తిక్ ఉన్నారు. దినేష్ ఫెస్ట్ కంట్రోలర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురు స్తుండటంతో దినేష్ తన ద్విచక్ర వాహనాన్ని నాలా ప్రహరీ పక్కన పార్కు చేస్తుండగా నా లాలో వరద ఉధృతి విపరీతంగా పెరగడంతో వరద తాకిడికి ఉన్న ఫలంగా ప్రహరీ గోడ కూ లిపోయింది. అదే సమయంలో తన ద్విచక్ర వాహనం కింద పడుతున్న సమయంలో వా హనాన్ని పట్టుకునే క్రమంలో దినేష్ వాహనంతో సహా నాలాలో పడి కొట్టుకుపోయా డు.

నాలాలో స్థానిక ఉన్న ఓ పైపును పట్టుకొని రక్షించండి.. రక్షించండి అని కేకలు వేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తా డు వేసి రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో నాలాలో కొట్టుకుపోయాడు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు వినోబా నగర్ నుంచి ప్రేయర్ పవర్ చర్చి, ఆశీర్వాద అపార్ట్మెంట్, అడిక్మెట్ మీదుగా ముసరాంబాగ్ వరకు వెతికిన ఆచూకీ లభించలేదు. ప్రేయర్ పవర్ చర్చి సమీపంలో ఉన్న నాలాపై కప్పు తెరిచి చూడగా దినేష్ ద్విచక్ర వాహనం కనిపించిం ది.

ఇక్కడే నాలాలో ఉండవచ్చని జిహెఎంసి, హైడ్రా సిబ్బంది కచ్చానాల మ్యాన్ హోల్డ్ ఒక్కొక్కటి తెరుచుకుంటూ అందులోకి దిగి టార్చ్ లైట్ సహాయంతో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. కాగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్‌గౌడ్ అధికారులకు సమాచారం అందించారు. జిహెఎంసి కమిషనర్ కర్ణన్, కమిషనర్ ఏవి రంగనాథ్,  జిహెఎంసి చీఫ్ ఇంజనీర్ రత్నాకర్,  ఎస్సీ ఆశాలతా, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి,  డిఈ వినయ్, ఏఈ మురళి, డిఎంసి రామానుజులరెడ్డి నాళాలను పరిశీలించారు. దినేష్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  సన్నీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ డిమాండ్ చేశారు.

నాలాల ఆక్రమణల వల్లనే వరదలు: రంగనాథ్

గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. నాలాల ఆక్రమణల వల్లనే వరదలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నాలా పక్కన ఉన్న పేద ప్రజలే ఇలాంటి  ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. వరదలకు సంబంధించిన విషయమై శాశ్వత పరిష్కారం కొరకు జిహెఎంసి అధికారులతో మాట్లాడి శాశ్వత చర్యలు చేపడతామని తెలిపారు. వినోబానగర్ లో నాలా ఆక్రమణలను కూల్చివేస్తామని తెలిపారు. 

రూ.5 లక్షల పరిహారం: కలెక్టర్ 

వరదల్లో గల్లంతైన కుటుంబాలకు తక్షణ మే రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ప్రకటించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లలో నివసించేవారు వర్షాల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అఫ్జల్ సాగర్ నాలాపై మొత్తం 145 ఇండ్లు ఉన్నాయని గుర్తించామని, వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. 

ఫంక్షన్ హాల్ గోడ కూలి ఒకరి మృతి 

ఆరుగురికి గాయాలు 

మేడ్చల్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): భారీ వర్షాలకు తడిసిన గోడ కూలి ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడిన ఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరిగింది. గుండ్లపోచంపల్లిలోని వీ కన్వెన్షన్ ప్రహరీ ఆనుకొని ఉన్న రేకుల షెడ్డులో కూలీలు నివసిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ప్రహరీ కూలీ రేకుల షెడ్డు మీద పడింది. దీంతో అందులో ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన గగన్ అనే వ్యక్తి మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుడు అపర్ణ రెడీమిక్స్‌లో పనిచేస్తున్నాడు.