17-08-2024 12:00:00 AM
ముంబై, ఆగస్టు14: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో అరశాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం భయాలు తొలగడంతో ప్రపంచ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపిన నేపథ్యంలో భారత్ సూచీలు సైతం శుక్రవారం పరుగులు తీశాయి. దేశీయ ఈక్విటీలకు ఐటీ, బ్యాంకింగ్ షేర్లు నేతృత్వం వహించాయి. దీనితో రెండు రోజుల సూచీల పతనానికి బుధవారం బ్రేక్‌పడింది. భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒకదశలో 1,412 పాయింట్లు జంప్‌చేసి 80,518 పాయింట్ల వద్దకు చేరింది. చివరకు 1,331 పాయింట్ల లాభంతో 80,436 పాయింట్ల వద్ద నిలిచింది.
గత రెండు నెలల్లో సెన్సెక్స్ ఇంతగా పెరగడం ఇదే ప్రధమం. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 397 పాయింట్లు లాభపడి 24,541 పాయింట్ల వద్ద ముగిసింది. ర్యాలీ విస్త్రతస్థాయిలో జరిగిందని, ప్రధాన సూచీలతో పాటు మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు సైతం జోరు చూపించాయని స్టాక్స్‌బాక్స్ డెరివేటివ్ అనలిస్ట్ అవధూత్ బాగ్‌కర్ చెప్పారు. ఆసియా మార్కె ట్లో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు సైతం భారీగా పెరిగాయి. యూరప్ మార్కెట్లు చాలావరకూ గ్రీన్‌లో ముగిసాయి. యూఎస్ మార్కెట్లు గురువారం పెద్ద ర్యాలీ జరిపాయి. వారం మొత్తంమీద సెన్సెక్స్ 730 పాయింట్లు, నిఫ్టీ 173 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.
ర్యాలీకి కారణాలివి..
జపాన్ కరెన్సీ యెన్ స్థిరపడటం గ్లోబల్ మార్కెట్ రికవరీకి ప్రధాన కారణమని, యూఎస్ రిటైల్ అమ్మకాలు పెరగడం, వీక్లీ జాబ్ లెస్ క్లెయింలు తగ్గడంతో అమెరికా మాంద్యం పట్ల ఏర్పడిన భ యాలు తొలిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మరోవైపు యూ ఎస్ ద్రవ్యోల్బణం మూడేండ్ల కనిష్ఠస్థాయి 3 శాతానికి తగ్గడంతో మార్కెట్ సెం టిమెంట్ మెరుగుప డిందని తెలిపారు. దీనితో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఈ సెప్టెంబర్‌లో తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ షేర్లలో కొనుగోలు ఆసక్తి పెరిగిందని వివరించారు. యూఎస్‌లో సానుకూల గణాంకాలు వెలువడటంతో మాంద్యం ఆందోళన సన్నగిల్లిందని, ఫెడ్ రేట్ల కోతపై ఆశలు పెరిగాయని, దీంతో భారత్‌తో సహా గ్లోబల్ ఈక్విటీ మెగా ర్యాలీ జరిగిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.
రూ.7.30 లక్షల కోట్లు పెరిగిన సంపద
మార్కెట్ తాజా ర్యాలీతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద రూ.7.30 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కె ట్ విలువ రూ.7,30,389.86 కోట్లు పెరిగి రూ.4,51,59,833 కోట్లకు (5.38 ట్రి లియన్ డాలర్లు) చేరింది.
టెక్ మహీంద్రా టాప్ గెయినర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టెక్ మహీంద్రా 4 శాతం పెరిగి రూ.1,680వద్ద ముగిసింది. మహీంద్రా అండ్ మహీంద్రా 3.45 శాతం లాభపడింది. టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్‌లు 3 శాతం వరకూ పెరిగాయి. సన్‌ఫార్మా ఒక్కటే స్వల్ప నష్టంతో ముగిసింది.
అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. అన్నింటికంటే అధికంగా ఐటీఇండెక్స్ 2.72 శాతం పెరిగింది. రియల్టీ ఇండెక్స్ 2.45 శాతం పుంజుకుంది. టెక్నాలజీ ఇండెక్స్ 2.23 శాతం పెరగ్గా, ఆటోమొబైల్ ఇండెక్స్ 1.90 శాతం ఎగిసింది. కమోడిటీ ఇండెక్స్ 1.89 శాతం, పవర్ ఇండెక్స్ 1.80 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.77 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.74 శాతం చొప్పున పెరిగాయి.