calender_icon.png 15 July, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గుతున్న రియల్ ఎస్టేట్ సెంటిమెంట్

18-08-2024 12:00:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 17 (విజయక్రాంతి): దేశంలో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ స్కోర్ తగ్గుతోందని నరెడ్కో నైట్‌ఫ్రాంక్ సంస్థలు తాజాగా వెల్లడించిన నివేదికలో పేర్కొన్నాయి. 2022లో మొదటి, ద్వితీయ త్రైమాసికాల్లోనూ మెరుగ్గానే ఉన్నప్పటికీ తృతీయ త్రైమాసికం నుంచి 2023 తృతీయ త్రైమాసికం వరకు రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ స్కోర్ తగ్గుతూ వస్తోంది. రియల్ ఎస్టేట్ స్కోర్ 2023తో పోల్చితే 2024లో మొదటి త్రైమాసికంలో 75 పాయింట్లతో మెరుగ్గానే ఉన్నప్పటికీ, ద్వితీయ త్రైమాసికంలో మాత్రం 65 పాయింట్లకు తగ్గింది. అయితే ఈ పాయింట్లు ఎంత తగ్గితే రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ అంత తగ్గినట్టని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలోనూ ఇదే పరిస్థితి ఉందని, భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుందని మరికొండరు బిల్డర్లు పేర్కొంటున్నట్టు తెలిపారు. సమీప భవిష్యత్తులో స్థిరాస్తుల ధరలు మరింత పెరుగుతాయని మెజార్టీ బిల్డర్లు అభిప్రాయపడుతున్నారని నరెడ్కో నైట్‌ఫ్రాంక్ తాజా నివేదికలో వెల్లడించారు.