28-04-2025 12:00:00 AM
కథలు రాయడం ఒక కళ. అవి సమాజ జీవనానికి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. ఎంతోమందికి ఎన్నో ఊహలు ఉంటాయి. వాటికి అక్షర రూపం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. కానీ, అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒక కథ రాయాలంటే ఎంతో అధ్యనం చేయాలి. ఓ మంచి కథ రాయడానికి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడప వలసి వస్తుందని సాహిత్య విశ్లేషకులు చెబుతుంటారు.
రాసిన కథలకు తుది మెరుగులు దిద్దడానికి కూడా రోజు లు, నెలలు పడుతుంది. ‘కథా సోపానములు’లోని వ్యాసాలు చదివిన వారికి ఈ అభిప్రాయమే కలుగుతుంది. ప్రముఖ కథా రచయిత, పరిశోధకులు డా. బీవీఎం స్వామి దీనిని వెలువరించారు. కథపై ఎం తో పరిశోధన చేసి మరీ వీటిలోని వ్యాసాలకు ఒక రూపం ఇచ్చారు. ‘సోపానములు’ అంటే నిచ్చెనలు. అందుకే, దీనిలోని శీర్షికలకు ‘మెట్లు’ అని పేరు పెట్టారు.
ఇందులో మొత్తం 24 మెట్లు ఉన్నాయి. కథ- కథానికకు తేడా, కథకు ఎలాంటి పేరు పెట్టాలి, ప్రారంభం ఎలా ఉండాలి, వర్ణనలు, పాత్ర లు, సంభాషణలు, ముగింపు ఎలా ఉండా లి వంటి అనేక విషయాలను విడమరిచి చెప్పారు. సందర్భాన్నిబట్టి ఉదాహరణలు కూడా చూపించారు.
ఇటీవలి కాలంలో బాలల కథలు కూడా ఎన్నెన్నో వస్తున్నాయి. ఆ కథలు కూడా ఎలా ఉండాలి, ఎలా రాస్తే బాలలను, పెద్దలను ఆకట్టుకుంటాయో కూడా రచయిత విడమరిచి చెప్పారు. ఇది కొత్తగా కథలు రాసేవారికి మార్గదర్శనం అనడంలో సం దేహం లేదు. ఇది చదివితే కథకుడి అవగాహనలో మార్పు వస్తుంది. కొత్త ఊహలు రెక్కలు తొడుగుతాయి. ముందుమాటలు అందించిన ప్రొ. బన్న ఐలయ్య, కథకులు, విమర్శకులు విహారి అభినందనీయులు.
కథా సోపానములు,
రచన: డా.బి.వి.ఎ న్. స్వామి,
పేజీలు: 140, వెల:రూ.300/-
ప్రతులకు: నీల్ కమల్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుల్తాన్‌బజార్, కోఠి, హైదరాబాద్ 500001