24-07-2025 12:45:02 AM
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హనుమకొండ టౌన్, జూలై 23 (విజయక్రాంతి): పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,
జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావేటి కవిత లతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ప్రతులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, అధికారులతో కలిసి దేశాయిపేట ఎస్సీ కాలనీలో కలియ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. ఏసిపి శుభం, కార్పొరేటర్ బసవరాజు కుమార్, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్న రాణి, సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, తాసిల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా మహాలక్ష్మి సంబరాలు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత మహాలక్ష్మి ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సంబ రాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యా వరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి లతో కలసి మంత్రి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు.
అనం తరం మహాలక్ష్మితో మహిళా సాధికారతపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు మంత్రి సురేఖ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.