03-10-2024 11:40:17 AM
ఐదుగురుపై దాడి, చిన్నారి పరిస్థితి విషమం
హుజురాబాద్, విజయక్రాంతి : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కోరపల్లిలో గురువారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఐదుగురిని గాయపరచగా అందులో మూడు సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అనంతరం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ కి తరలించినట్లు తెలిపారు.