16-05-2025 12:58:30 AM
గూడూరు.మే 15: (విజయక్రాంతి) వచ్చే బక్రీద్ పండగ సందర్భంగా ఎలాంటి ఆవుల అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు సిఐ హెచ్చరించారు. బుధవారం గూడూరు మండల కేంద్రంలో ఆయన ఎస్త్స్ర గిరిధర్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గూడూరు మండలం భూపతి పేట వద్ద పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎవరైనా ఆవులను అక్రమంగా తరలిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని త్రిబుల్ రైడింగ్ తాగి డ్రైవింగ్ చేసినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.