calender_icon.png 24 November, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం రవాణా చేస్తే కఠిన చర్యలు

11-02-2025 12:00:00 AM

సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రఘునందన్

నల్లగొండ, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సివిల్ సప్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మర్రిగూడ మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో సోమవారం పలు వాహనాలను ఆయన తనిఖీ చేశారు.

రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా విక్రయించే వారు దందా మానుకోవాలని సూచించారు. రేషన్ బియ్యం సేకరణ, అక్రమ నిల్వలు, రవాణపై ప్రత్యేక నిఘా పట్టినట్లు చెప్పా రు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రహసనం చేస్తే డీలర్లపైనా క్రిమినల్ కేసులు తప్పవన్నారు. లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని వినియోగించుకోకుండా అమ్ముకోవడం నేరమని తెలిపారు.