calender_icon.png 24 November, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదమరిచారో.. ఆయువు తీస్తుంది..!

11-02-2025 12:00:00 AM

హుజూర్‌నగర్, ఫిబ్రవరి 10: హుజూర్‌నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో రాంపురం రోడ్ నుంచి కోట్లగడ్డకు వెళ్లే దారిలో నడి రోడ్డుపై మిషన్ భగీరథ పైపు సంబంధించి మ్యానువల్ కట్టారు.ఆ గుంట దగ్గరికి వచ్చిదాక కూడా వాహనదారులకు కనబడటం లేదు.

ఆ మాన్యువల్‌పై ఉన్నటువంటి బండ ఇప్పటికీ ఐదు,ఆరుసార్లు పలిగినా  అధికారులు పట్టించుకోక పోవడంతో దానివల్ల ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు. అదృష్టవశత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది.

దయచేసి వెంటనే ఆ నడి రోడ్డు పైన ఉన్న గుంటను పూడ్చడం లేదా ప్రమాదం జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోగలరు.దాని వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఇకనైనా దానికి వెంటనే అధికారులు స్పందించి అ గుంటకు మారమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇబ్బంది లేకుండా చూస్తాం..మిషన్ భగీరథ అధికారులకు  తెలిపాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం..

 అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, నేరేడుచర్ల