27-12-2025 12:00:00 AM
డీఎస్పీకి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకుల వినతి
బాన్సువాడ, డిసెంబర్ 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం గ్రామానికి చెందిన ఎస్సీ మహిళాపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత దేవేందర్ రెడ్డి అసభ్యంగా లైంగికంగా వేధించడంతో అతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి, పట్టణ ఎస్ హెచ్ వో శ్రీధర్ లకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.
కాంగ్రెస్ నేత దేవేందర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయాలని మహిళలపై మరోసారి ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి నెర్రె నర్సింలు బాన్సువాడ డివిజన్ ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు, తాడ్కోల్ మాజీ సర్పంచ్ రాజు డివిజన్ నాయకులు బేగరి డాక్టర్ సాయిలు పాల్గొన్నారు.