calender_icon.png 3 November, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ కార్యాలయం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

02-11-2025 07:41:39 PM

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు 

ఆళ్ళపల్లి (విజయక్రాంతి): మణుగూరు  బీఆర్ఎస్ కార్యాలయం ధ్వంసం చేసిన కాంగ్రెస్ మూకలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆళ్లపల్లి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని మర్కోడులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణుగూరులోని టిఆర్ఎస్ తెలంగాణ భవన్ కాంగ్రెస్ మూకలు దాడి చేసి ఫర్నిచర్ తదితర సామాగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా కార్యకర్తలపై దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ భౌతిక దాడులకు దిగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తుందని గత పదేళ్ల టిఆర్ఎస్ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడుతున్న వ్యతిరేకతను ఓర్చుకోలేక మానసిక ఒత్తిడికి గురై భౌతిక దాడులకు పాల్పడుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది అన్నారు. ఇలాంటి దాడులకు టిఆర్ఎస్ కార్యకర్తలు భయపడాలని రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తామని అన్నారు.

కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ మెన్షన్ చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు వెంటనే చేపట్టాలని లేని ఎడల ఆందోళన ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంజు భార్గవి మాజీ జెడ్పిటిసి కొమరం హనుమంతరావు మండల ప్రధాన కార్యదర్శి ఎస్కె బాబా మాజీ సర్పంచ్ నరసింహారావు వెంకటేశ్వర్లు వేమూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.