calender_icon.png 3 November, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీ.పి.ఓను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఎన్‌టియు‌సి నేత

02-11-2025 07:43:29 PM

అశ్వాపురం (విజయక్రాంతి): జిల్లా పంచాయతీ అధికారి(డీ.పి.ఓ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బొప్పన అనూషను హెవీ వాటర్ ప్లాంట్ ఐఎన్‌టియు‌సి సెక్రటరీ షేక్ రన్ను హుస్సేన్ ఆదివారం కొత్తగూడెంలో ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హుస్సేన్  డీ.పి.ఓ అనూషకు పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించి, కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని కోరుకున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో టాపర్‌గా నిలిచి జిల్లా పంచాయతీ అధికారి హోదాలో బాధ్యతలు స్వీకరించడం అనూష ప్రతిభకు నిదర్శనమని ఆయన అభినందించారు. విధి నిర్వహణలో అధికారుల, ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.