11-10-2025 07:09:31 PM
రేగోడు: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై పోచయ్య అన్నారు. శనివారం మండల కేంద్రమైన రేగోడులో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకొని టు వీలర్ వాహనాలు నడపాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.