calender_icon.png 12 October, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోథ్ లో 18 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు

11-10-2025 07:10:30 PM

రూ.10 కోట్లతో పట్టణ సుందరీకరణ..

బోథ్ (విజయక్రాంతి): బోథ్ పట్టణంలో 18 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. అలాగే పట్టణ వర్గీకరణకు 10 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బోథ్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పట్టణంలోని పలు కూడళ్లను, వీధులను పరిశీలించారు. R&B, PR శాఖ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిపారు. సాధ్యమైనంత త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బోథ్ ప్రజల చిరకాల కోరిక అయిన డిగ్రీ కాలేజి, ఫైర్ స్టేషన్ కొరకు సైతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు R&B DE అరవింద్, PR DE ధర్మేందర్, AE చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.