calender_icon.png 16 December, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటిష్ట ఏర్పాట్లు చేయాలి

16-12-2025 12:35:17 AM

  1. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,డిసెంబర్15(విజయక్రాంతి):3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు.

సోమవారం వెంకటాపురం, వాజేడు,ఎంపీడీవో కార్యాలయాల్లో, కన్నాయిగూడెం రైతు వేదికలో వేరు వేరుగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మండల ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, జోనల్ ఆఫీసర్స్,ఆర్వోలు,మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంలలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు.అధికారుల ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేసి, పోలింగ్ డే రోజున ఎలాంటి లోపాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.