calender_icon.png 29 December, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గట్టిగా న్యూ నిఘా

29-12-2025 02:06:57 AM

నూతన సంవత్సర వేడుకుల సందర్భంగా వాహనాలు, రైళ్లలోనూ ఎక్సైజ్ శాఖ తనిఖీలు ముమ్మరం

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ హెచ్చరిక 

హైదరాబాద్, డిసెంబర్  28 (విజయక్రాంతి) : నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై  ప్రొహిబిషన్ అండ్ ఎక్స్‌జ్ శాఖ గట్టి నిఘా పెట్టింది. నూతన సంవత్సరం వేడుకల్లో వీటిని అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు, జిల్లాల టాస్క్‌ఫోర్స్, అబ్కారీ పోలీస్ స్టేషన్ల బృందాలు విడివిడిగా ప్రత్యేక దాడులు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో పాటు డ్రగ్స్ సరఫరా, అమ్మకాలు, వినియోగాలపై దాడులు పెంచామన్నారు.

రైళ్లు, మార్గాల ద్వారా బస్సుల్లో, పార్సిల్ వాహనాల్లో, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలతో పాటు వాయు మార్గాల్లోనూ వచ్చే అవకాశం ఉన్నందున, వాటన్నింటిపైన ప్రత్యేకం గా తనిఖీలు నిర్వహించనున్నట్లు కమిషనర్ హరికిరణ్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే పార్టీల్లో మద్యం వినియోగించుకునే చోట ఎక్సైజ్ శాఖ అనుమతులు తీసుకోవాలని, లేనిపక్షం లో కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్, గంజాయి వినియోగించడం నేరమని, వీటికి దూరంగా ఉండి నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.