30-04-2025 10:15:42 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం సభ్యులతో స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు బుధవారం వేరువేరుగా నిర్వహించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు మాట్లాడుతూ.. కమిటీ సమావేశంలో హాజరైనటువంటి సంబంధిత అధికారులతో చర్చించి వారి డిమాండ్ల అమలుకు సాధ్య సాధ్యలను పరిశీలించారు. ఏరియా పరిధిలో పరిష్కరించదగిన డిమాండ్లను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిఎంతో పాటు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ కమిటీ, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ వి. మల్లికార్జున రావు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె గట్టయ్య, సత్తుపల్లి ఏరియా ప్రతినిధి సముద్రాల సుధాకర్, పాల్గొన్నారు. ప్రాతినిధ్య సంఘం ఐఎన్టియుసి స్ట్రక్చర్ కమిటీ, వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి. నాగరాజు, స్ట్రక్చర్ కమిటీ మెంబర్ కే సమ్మయ్య పాల్గొన్నారు. యాజమాన్య ప్రతినిధులుగా ఎస్ఓటు జిఎం జివి.కోటిరెడ్డి, ఎజిఎం (సివిల్) సిహెచ్. రామకృష్ణ, ఏజెంట్ పద్మావతి ఖని బి.రవీందర్, డీజీఎం(పర్సనల్) బి. శివకేశవరావు, జీకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.శ్రీ రమేష్, కిష్టారం ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి.నరసింహారావు, డిజిఎం (ఐఈడి) ఎన్. యోహన్, డిజిఎం (ఈ & ఎం) ఏరియా వర్క్ షాప్ టి శ్రీకాంత్, ఏరియా స్టోర్స్ ఇంచార్జ్ లక్షణమూర్తి, ఐటి మేనేజర్ కే. శేష శ్రీ, ఇంచార్జ్ ఆర్.సి. హెచ్.పి ఎస్.కే.కరీముల్లా, సీనియర్ పిఓలు మజ్జి మురళి పాల్గొన్నారు.