calender_icon.png 1 May, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ప్రజల గొంతెండడానికి మంత్రి తుమ్మలే కారణం

30-04-2025 09:58:32 PM

మంచినీటి కోసం నిల్వ ఉంచిన గోదావరి నీటిని సాగర్ కాలువకు తరలింపు..

సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు..

భద్రాచలం (విజయక్రాంతి): మిషన్ భగీరథకు నీటి కొరత తుమ్మల పుణ్యమేనని, జిల్లా ప్రజల గొంతెండడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) కారణమని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు(CPM District Secretary Macha Venkateswarlu) అన్నారు. మే డే ఏర్పాట్లు పరిశీలనలో భాగంగా భద్రాచలం వచ్చిన ఆయన బుధవారం బండారు చందర్రావు భవన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అశ్వాపురం మిషన్ భగీరథ మంచినీటి నిల్వ కేంద్రం నుండి సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా 9000 క్యూసెక్కుల నీటిని గోదావరికి గండి కొట్టి సాగర్ కాలువకు తరలింపు చేయడం వల్ల జిల్లాలో మంచినీటి కొరత ఏర్పడిందన్నారు.

జిల్లా ప్రజలకు మంచినీటి కొరత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుణ్యమేనని విమర్శించారు. గోదావరి నదిలో నీరు నిల్వ లేకపోవడంతో వారం రోజుల పాటు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారన్నారు. ముందు చూపు లేకుండా గోదావరి నదికి గండి కొట్టి సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా సాగర్ కాలువకు నీరు తరలించడం వల్ల మంచి నీటి కొరత ఏర్పడిందన్నారు. మంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఇది సరైనది కాదన్నారు. జిల్లా ప్రజలకు నష్టం కలిగించే విధంగా గోదావరి నీటిని తరలించుకుపోతే చూస్తూ ఊరుకునేది లేదని సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి కే బ్రహ్మచారి అన్నవరపు సత్యనారాయణ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా,బండారు శరత్ బాబు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు పి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.