calender_icon.png 19 November, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు పారమిత విద్యార్థి

19-11-2025 07:26:30 PM

ముకరంపుర (విజయక్రాంతి): నగరంలోని  పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థి కె. విశిష్ఠ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించిందని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ  తెలిపారు. ఇటీవల చొప్పదండి మండలంలో ఉమ్మడి జిల్లా ఎస్.జి.ఎఫ్ ఆద్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి నెట్ బాల్ చాంపియన్సిప్ పోటీలలో కె. విశిష్ఠ అండర్-17 బాలికల ఎంపిక పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఈ నెల 21 నుండి 23 వరకు నల్గొండ జిల్లాలోని అనుముల మండలంలో నిర్వహించనున్న 69వ రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో ఎంపీకయిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి కె. విశిష్టను పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, పాఠశాల డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్,  హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత ప్రసాద్ సమన్వయకర్త శ్రీనాథ్, నెట్ బాల్ పి.ఇ.టి పి. తిరుపతిలు అభినందించారు.