calender_icon.png 29 August, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సామర్ధ్యాలను పెంపొందించాలి

29-08-2025 01:17:48 AM

  1. ఎస్ ఎస్ సి పాసైన వాళ్లను గుర్తించాలి 
  2. పి.ఆర్ శ్రీ పథకం నిర్మాణ పనులు చేపట్టాలి
  3. యూరియా పంపిణీ ఘర్షణ లేకుండా చూడాలి
  4. జ్వరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలి
  5. పాఠశాల, ఆస్పత్రులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 

గోపాలపేట ఆగస్టు28 : విద్యార్థుల సా మర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. గురువారం గోపాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఎంతమంది ఉత్తరనులు అయ్యారని వారి జాబితా తెల పాలన్నారు ముఖ్యంగా పదవ తరగతి ఉత్తీర్ణులైన ఎందుకు చదువుకుంటలేరో వారిని గుర్తించాలని ఉపాధ్యాయులకు తెలిపారు.

పి ఆర్ శ్రీ పథకం కింద విద్యార్థుల కోసం పాఠశాలలో మంజూరైన సైన్స్ ల్యాబ్ గదు ల నిర్మాణా పనులు ఎందుకు ఆగిపోయావ ని సంబంధిత శాఖలను అడిగి తెలుసుకున్నారు వెంటనే ఆ పనులను పూర్తి చేసి వి ద్యార్థులకు అప్పజెప్పాలని సూచించారు. అంతేకాకుండా పి ఆర్ శ్రీ పథకం కింద పాఠశాలకు వచ్చిన మ్యూజిక్ డ్రమ్స్ లను పరిశీలించారు వీటన్నిటిని కూడా వినియోగంలోకి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు.

 ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

 ప్రభుత్వ ఆసుపత్రి నీ జిల్లా కలెక్టర్ ఆద ర్శ సురభి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని చెప్పారు ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టులు తప్పకుండా చేయాలన్నారు. డెం గ్యూ వ్యాధి సోకిన గ్రామస్తుల కాలనీలో ఎ లాంటి చర్యలు చేపడుతున్నారో అధికారులు గుర్తించాలని చెప్పారు. 

యూరియా విక్రయాలు ఘర్షణ లేకుండా జరగాలి

 గోపాలపేట సింగిల్ విండో కార్యాలయంలో యూరియా పంపిణీ రైతులకు గొడవ లేకుండా జరిపించాలన్నారు. ప్రతి ఒక్క రైతుకు యూరియా అందేలా అధికారులు చూసుకోవాలని చెప్పారు. ప్రైవేటు డీలర్లు ఎవరైనా కల్తీ యూరియా విక్రయాలు జరుగుతే వెంటనే చదివేసే పడతామని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో తాసిల్దార్ సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.