29-08-2025 01:15:34 AM
చిన్న చింతకుంట ఆగస్టు 28 (విజయ క్రాంతి) : అక్రమ కార్యక్రమములను అడ్డుకట్ట వేయవలసిన అధికారులకు సమాచారం అందిస్తేనే స్పందిస్తున్నారు. చిన్న చింతకుంట కుంట మండలంలో పరిధిలో ఇప్పటికే ఇసుకను ఎడ్లబండ్లతో ఎత్తేస్తున్నారు.. అక్రమంగా అనుమతి లేకుండా చెట్లను తొలగిస్తున్నారు.. ఇలా వరుసగా కథనాలు రాసి అధికారులకు దృష్టికి తీసుకు వస్తున్న విజయ క్రాంతి దినపత్రిక వరుస కథనాలకు అధికారులు స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
ఇసుకను సీజ్ చేయడం, అక్రమంగా చెట్లను కొట్టిన వారికి చర్యలు తీసుకునేలా 9వతాధికారులకు విచారణ చేయడం వంటి చర్యలకు అడుగులు పడ్డాయి. సమాచారం అందిస్తేనే అక్రమ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తారా ? అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అమ్మపూర్ గ్రామం లోని కురుమూర్తి స్వామి గుట్ట వెనక భాగంలో ఉన్న తిప్పగుట్ట నుంచి మదనపురం మండలం కొన్నూరు గ్రామ రోడ్డు పనులకు
అనుమతి లేకుండా కాంట్రాక్టర్లు మట్టిని తరలిస్తున్నారు. ఈ వ్యవహారం గత ఐదు రోజుల నుండి అనునిత్యం రాత్రి పగలు అని తేడా లేకుండా కొనసాగుతూనే ఉన్న అధికారులు అటువైపు చూడడమే మానేశారు.
- అక్రమాలు మమ్ములేనా..?
మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. సొంత పట్టగలిగిన భూముల నుండి కూడా మట్టి తవ్వకాలు చేపట్టాలంటే వాటికి సంబంధించిన అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అని ఈ వ్యవహారం గమనించిన గ్రామస్తులు మట్టి తరలింపును అడ్డుకున్నారు. అక్రమాలు కార్యకలాపాలు జరగడం మామూలే అనే విధంగా చిన్న చింతకుంట మండలంలో కొనసాగుతున్నాయి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తాసిల్దార్ కు విజయ క్రాంతి దినపత్రిక సమాచారం అందించింది. ఈ విషయంపై ఆర్‌ఐ తిరుపతయ్య సంఘటన స్థలానికి చేరుకొని మట్టి తరలింపును నిలిపి వేసినట్లు సంబంధించి అధికారి తెలిపారు.
అనుమతి లేదు... మైనింగ్ శాఖకు చెబుతాం
మండలంలో మట్టి తరలింపుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. ఈ విషయాన్ని మైనింగ్ పూర్తి సమాచారం చెబుతాం. సిబ్బందిని కూడా అక్రమంగా మట్టి తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేయాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మట్టి తరలింపు జరగడం లేదు. నిబంధన అతిక్రమించి మట్టి తరలింపు చేస్తే కట్న చర్యలు తీసుకుంటాం.
ఎల్లయ్య, తహసిల్దార్,
చిన్న చింతకుంట మండలం,
మహబూబ్ నగర్