10-08-2025 12:17:41 AM
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివి ధ రాష్ట్రాల నుంచి పలువురు విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు. రాష్ర్టపతి భవన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు తెలంగాణ నుంచి సైతం పలువురు విద్యార్థులు, టీచర్లు ఢిల్లీకి చేరుకొని నిర్వహించిన కార్యక్రమంలో పా ల్గొన్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు.
మలక్‌పేట అం ధుల పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినులు, ఇద్దరు టీచర్లు, పెద్దపల్లి జిల్లా అంత ర్గాం కేజీబీవీ పాఠశాల నుంచి ఒక టీచర్, ఐదు గురు విద్యార్థినులు హాజరైనట్లు ఆయ న తెలిపారు. కాగా అందర్నీ కలుపుకొని వెళ్లేలా విద్యార్థులను ప్రోత్సహిం చేందుకు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ర్టపతి ద్రౌపది ముర్ము, అధికారులు పాల్గొన్నారు.