07-08-2025 12:32:51 AM
అలంపూర్, ఆగస్టు 06:వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కోయిల్ దిన్నే నుంచి శాంతినగర్ కు వెళ్ళే ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరభరితంగా మారాయని దీం తో వాహదారులు , ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రోడ్డు బాగు చేసి ప్రమాదాల బారి నుంచి కాపాడాలని వారు నిరసన వ్యక్తం చేశారు.
ఈ రహదారి గూండా నిత్యం భారీ వాహనాలు తిరగడంతో అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షానికి నీళ్ళు నిలిచి ఇబ్బందికరంగా మారాయని తెలిపా రు. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు రోడ్డు దుస్థితి వల్ల సకాలంలో పాఠశాలకు చేరుకోలేకపోతున్నట్టు తెలిపారు. దీనిపైన సంబంధిత అధికారులు స్పందించి మున్సిపాలిటీ పరిధి వరకు తగు బీటి రోడ్డు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని 9 ,10 వార్డులకు సంబంధించి సరైన సిసి రోడ్లు ,మురుగు కాలువలు లేక చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీళ్లు నిలిచి వాటిపైన దోమలు వాలి డెంగ్యూ,మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు సోకే అవకాశం ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోయ వెంకటేశ్వర్లు, మోహన్ యాదవ్, శేఖర్ ఆచారి ఈశ్వర్ నరేష్ రాఘవేంద్ర భూషణ్ గోవర్ధన్ హరి అయ్యరాజు, తదితరులు పాల్గొన్నారు.