30-08-2025 01:19:26 AM
విద్యార్థుల అవస్థలు
బూర్గంపాడు,ఆగస్టు29, (విజయక్రాంతి): అసలే వర్షాకాలం...ఆపై రహదారులపై ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిలిచి వచ్చి, పోయే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. మరోపక్క రహదారులపై నిలిచిన నీరు, రహదారులపై ఏర్పడిన గుం తలలో నిలిచిన నీటితో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో ఉదయాన్నే లేచి పాఠశాలకు వెళ్ళేందుకు సిద్ధమై బస్టాప్ కు వెళ్ళి స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఆయా మార్గాల్లో వచ్చి, పోయే వాహనాల వలన స్కూల్ డ్రెస్ మొత్తం బురదమయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా
రు. వాహనదారుల అతి వేగంతో పాటు ఆయా రహదారులపై ఏర్పడిన గుంతలలో నిలిచిన బురద నీటి వలన విద్యార్థుల యూనిఫాం వాహనాలు వచ్చి, పోయే సమయంలో బురదమయంగా మారుతూ, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఓ పక్క పాఠశాలకు సమయానికి చేరుకోవాలని ఉన్నా, వాహనాల వలన యూనిఫాం బురదమయంగా మారుతుండటంతో విద్యా ర్థులు సమయానికి పాఠశాలలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇకనైనా సంబంధిత అధికారులు విద్యార్థులకు ఇబ్బందులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.