calender_icon.png 30 August, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

30-08-2025 01:15:36 AM

మణుగూరు, ఆగస్టు 29 ( విజ య క్రాంతి) : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం పూర్తి చేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తహసిల్దార్ అద్దం కి నరేష్ కోరారు. మండలంలోని కొండాయిగూడెం శివాలయం పుష్కర్ ఘాట్, చిన్న రావిగూడెం వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ను శుక్రవారం సీఐ పాటి నాగబాబు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎండిఓ శ్రీనివా సరావు లతో కలిసి పరిశీలించారు.

ఈసం ద ర్భంగా వారు మాట్లాడుతూ క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాలను గోదావ రిలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని, ఉత్సవ కమిటీలు పోలీసు వారికి సహ కరించాలన్నారు. నిమజ్జన ఊరేగింపు ల్లో చిన్న పిల్లను తీసుకురావద్దన్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నం దున బారికేడ్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గజ ఈ త గాళ్లను అందుబా టు ఉంచు తున్నట్లు వివరించారు. నిమజ్జన సమయం లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎస్. ఐ రంజిత్, ఎంపీఓ పలనాటి వెంకటేశ్వరరావు, సింగరేణి సెక్యూరిటీ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.