07-10-2025 12:56:09 AM
కొత్తపల్లి, అక్టోబరు 6 (విజయ క్రాంతి): హన్మకొండ పట్టణంలోని జె.ఎన్ స్టేడియంలోని ఈనెల 10, 11, 12 తేదీలలో నిర్వ హించనున్న ఎస్ జి ఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలకునగరంలోని పారమిత ఉన్నత పాఠ శాలలోని ముగ్గురు విద్యార్థులు అర్హత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ తెలిపారు.
ఇటీవల కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా ఎస్.జి.ఎఫ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎస్.జి.ఎఫ్ అండర్ 17 బాలబాలికల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలలో పాఠశాలకు చెందిన తనుశ్రీ 54-57 కిలోల విభాగంలో, పి.సిమ్రిత రెడ్డి 75-80 కిలోల విభాగంలో, జి. సాకేత్ రెడ్డి 75-80 కిలోల విభాగంలో బంగారు పతకాలను గెలుపొంది రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను, బాక్సింగ్ కోచ్ ఎ. రామకృష్ణను పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, పాఠశాల డైరెక్టర్లు . ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్ , హనుమంతరావు. ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత ప్రసాద్ సమన్వయకర్త శ్రీనాథ్ లుఅభినందించారు.