31-10-2025 12:00:00 AM
వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ సీహెచ్ విద్యాసాగర్
రాజేంద్రనగర్, అక్టోబర్ 30( విజయక్రాంతి): అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ సిహెచ్ విద్యాసాగర్ అన్నారు. గురువారం విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజిలెన్స్ అనేది ప్రతి ఒక్కరు బాధ్యత అని.. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా యూనివర్సిటీలో భాగంగా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ శిఖ గోయల్ ఆదేశానుసారం హైదరాబాద్ రూరల్ యూనిట్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఇన్ఫోసిమెంట్ ఆఫీసర్ పాల్వాయి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విజిలెన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. అదే విధంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గోవర్ధన్ మాట్లాడుతూ విజిలెన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థినీ విద్యార్థులు తెలుసుకోవా లని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడి అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ రూరల్ యూనిట్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పాల్వాయి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూడడం, సంక్షేమ పథకాలు ప్రజలకు సరైన రీతిలో అందించటం విజిలెన్స్ ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో వారి భవిష్యత్తు ప్రణాళికల పై ముచ్చటించారు. దేశ భవిష్యత్తు భావితరాల మీద ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ విజిలెన్స్ శాఖకు సహకరించడం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. డాక్టర్ వి. రామిరెడ్డి , విజిలెన్స్ అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.