calender_icon.png 11 September, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి

11-09-2025 06:16:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న(District Education Officer Bhojanna) అన్నారు. గురువారం విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పోస్టర్లను డివో కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఆలోచనలను ఆవిష్కరించడం వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. విద్యార్థి విజ్ఞాన్ మంతన్ అన్ని పాఠశాలల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అత్యధిక సంఖ్యలో ఈ పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ జిల్లా కోఆర్డినేటర్ నాగుల రవి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక, సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ (NCERT) విజ్ఞాన్ భారతి సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తుందని తెలిపారు.

దేశంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉందని తెలిపారు.ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి భారతదేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసే అవకాశం మరియు ప్రముఖ పరిశోధనా సంస్థలో ఇంటెన్షిప్ చేసే సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు రిజిస్ట్రేషన్ ల కోసం www.vvm.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు 9440589047 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో SO1 రాజేశ్వర్, AMO నర్సయ్య, CMO ప్రవీణ్, ASC లింబాద్రి,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.