calender_icon.png 11 September, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి..

11-09-2025 06:21:12 PM

మంత్రి జూపల్లికి విద్యార్థి సంఘాల జేఏసీ వినతి..

అదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జోడేఘాట్ లో కొమరం భీం వర్ధంతి సాక్షిగా జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, కానీ హామీని విస్మరించి జిల్లా విద్యార్థులకు మోసం చేశారని విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గెడం కేశవ్ అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వం జిల్లా విద్యార్థుల భవిష్యత్ పై దృష్టిసారించి జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ నేలకోల్పాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)ను కలిసి విద్యార్థి సంఘాల జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. 

ఈ సందర్భంగా జేఏసీ చైర్మైన్ కేశవ్ మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లా అన్ని వనరులు కలిగినటువంటి జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎనుకబడిన ఆదివాసి, గిరిజన నిరుద్యోగులు అధికంగా ఉన్నారని, ఇతర ప్రాంతాల్లో కోచింగ్ కు వెళ్లాలంటే వేలల్లో, లక్షలలో ఫీజులు చెల్లించాలని, కావున ఆదివాసి గిరిజన నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టి సారించి తక్షణమే జిల్లాలో ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ సలాం వరుణ్, సమన్వయకర్త మడవి గణేష్. నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.