07-11-2025 01:24:46 AM
కలెక్టర్ పమేలా సత్పతి
మానకొండూరు, నవంబర్ 6 (విజయక్రాంతి):విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి గురుకుల విద్యాలయంలో గురువారం 11వ జోనల్ స్థాయి బాలుర క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
విద్యార్థుల ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని చెప్పారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలలో 13 పాఠశాలలకు చెందిన,1,105 విద్యార్థులు పోటీలకు హాజరవుతారు . మూడవ జోన్ పరిధిలోని సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలోని 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన బాలురు ఈ పోటీల్లో భాగస్వాములవుతారు.
6, 7, 8 తేదీల్లో జరిగే ఈ స్పోరట్స్ మీట్లో వాలీబాల్, అథ్లెటిక్స్,ఖోఖో, టెన్నికాయిట్, బాల్ బ్యాట్మెంటన్ ,హ్యాండ్ బాల్, చెస్, క్యారం, కబడ్డీ, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ విభాగాలలో విద్యార్థులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ప్రిన్సిపాల్ జగన్నాథం, ఇతర అధికారులుపాల్గొన్నారు.