15-11-2025 06:24:43 PM
కరీంనగర్ (విజయక్రాంతి): పార్టీలు వేరైనా వారిద్దరు మంచి స్నేహితులు. 2018 ఎన్నికల్లో బద్ధ శత్రువులుగా మారారు, అయితే గంగుల ఇంట్లో వివాహం వారిద్దరి మాటలను కలిపాయి. కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సోదరుడు గంగుల సుధాకర్ కుమారుడి వివాహంకు హాజరు కాలేకపోయిన మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కరీంనగర్ లోని వారి నివాసంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్బంగా కుటుంబ సభ్యులతో ఫోటో దిగి అందరిని ఆప్యాయంగా పలకరించడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.