calender_icon.png 15 November, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడి రైతుకు ఆర్థిక సాయం అందజేత

15-11-2025 06:22:10 PM

కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మ పెళ్లి గ్రామానికి చెందిన కూస రామిరెడ్డి అనే రైతు పాడి గేదెలు కరెంట్ షాక్ తో చనిపోగా రైతుకు భరోసాగా సెస్ సంస్థ ద్వారా 80వేల రూపాయల చెక్కును సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి అందజేశారు. సెస్ సంస్థ రైతులకు అన్ని విధాల సహకరిస్తుందని ఆపద సమయంలో రైతులకు, విద్యుత్ వినియోదారులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నామని సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి అన్నారు.

ఇది సహకార సంస్థ అని దీనిని కాపాడుకునే బాధ్యత వినియోగదారులు అందరికీ ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ గ్రామ ప్రతినిధులు అమరం భాస్కర్ రెడ్డి, చెంచు రాంరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, లైన్మెన్ రాములు సిబ్బంది సురేష్, గ్రామ పెద్దలు గోగు ప్రతాపరెడ్డి దొంతరవేణి శ్రీనివాస్, నల్ల గోవర్ధన్, కదిరే శ్రీనివాస్, వెంగలి తిరుపతి, గొర్రె శ్రీనివాస్, శీతల మోహన్ తదితరులు పాల్గొన్నారు.