calender_icon.png 10 January, 2026 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభను వెలికి తీయడానికే టోర్నమెంట్

08-01-2026 12:06:39 AM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జనవరి 7 (విజయక్రాంతి): యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ప్రతి ఏడాది రాజీవ్ గాంధీ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ జరుగుతోందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాం గ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. రాజీవ్ గాంధీ ఆలిండియా అండర్ 19 టీ-20 క్రికెట్ చాంపియన్ షిప్ 2026 కు మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంత రావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి బుధవారం హాజరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్ర మంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు హాజరయ్యారని ఎమ్మెల్యే తెలిపారు.