25-10-2025 01:02:29 AM
కందుకూరు జూనియర్ కాలేజ్లో డ్రగ్స్ అవగాహనలో సీఐ సీతారామ్
కందుకూరు, అక్టోబర్ 24: కందుకూరు మండల పరిధిలోని కందుకూరు జూనియర్ కాలేజ్లో శుక్రవారం డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ సీతారామ్ విద్యార్థులకు డ్రగ్స్, గంజా యి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు.ఈ సందర్భంగా సీఐ సీతారామ్ మాట్లాడుతూ,డ్రగ్స్ మన జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలని, వాటి ప్రభావంతో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
విద్యార్థులు ఈమత్తు పదార్థాల నుండి దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలి అని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు,విద్యార్థులు, అధ్యాపకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై స్పష్టమైన అవగాహన కల్పించబడిందని ఆయన తెలిపారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీఐ సీతారామ్ పిలుపునిచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.