11-10-2025 12:00:00 AM
కళా శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటిస్తూ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘దక్కన్ సర్కార్’. ఈ సినిమా పోస్టర్‌ను ప్రముఖ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. “దక్కన్ సర్కార్ చిత్ర విజయానికి నావంతు కృషి చేస్తా.
తెలంగాణ నుంచి ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలి” అని తెలిపారు. ‘ఇది ప్రజల జీవన స్థితిగతుల కథ’ అని చిత్ర దర్శకుడు, నిర్మాత శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్‌పాండే, చిత్ర హీరో చాణక్య, మరో లీడ్ యాక్ట్రెస్ మౌనిక, మిగతా చిత్రబృందం, కళాకారులు పాల్గొన్నారు.