calender_icon.png 24 November, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా సుధీర్ కుమార్

24-11-2025 12:00:00 AM

ఆలేరు, నవంబర్ 23 (విజయ క్రాంతి):  జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అధ్యక్షులు ముక్కేర్ల బిక్షపతి అధ్యక్షతన ఆలేరులో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరై సంస్థ విధివిధానాలను తెలియజేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గంగాధరి సుధీర్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి లక్ష్మణ్, స్టేట్స్ సోషల్ మీడియా సభ్యులు దిలీప్, విక్రమ్ గౌడ్, కురిమేటి రాజకుమార్, రవికుమార్, సాగర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.