07-11-2025 01:15:47 AM
ముంబై, నవంబర్ 6 : బాలీవుడ్ పాతతరం గాయని, నటి సు లక్షణా పండిట్ మృతిచెందారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచిన ట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 71 ఏళ్లు ఉన్న సులక్షణ, దీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్నారు. హిందీ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా మొదలైన సులక్షణ కెరీర్ ఆ తర్వాత ప్రముఖ హీరోలతో నటిగాను కొనసాగింది. ప్రముఖ గాత్ర సంగీత కళాకారుడు పండిట్ జెష్‌రాజ్‌కు ఆమె కోడలు. సంగీత దర్శకులు జతిన్, లలిత్‌కు సోదరి. న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో సులక్షణ జన్మించారు. మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న సులక్షణ లో సంజీవ్‌కుమార్ సరసన ‘ఉల్జన్’ చిత్రంలో మొదటి సారిగా నటించారు. జీవితాంతం ఆమె అవివాహితగానే ఉన్నారు.