calender_icon.png 7 November, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీ జిమ్ ప్రారంభిస్తా.. నేనే ట్రైనర్‌గా ఉంటా!

07-11-2025 12:12:50 AM

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ శుక్రవారం విడుదల కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొం దుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ కార్యక్రమంలో జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు రష్మిక చెప్పిన సరదా సమాధానాలు ఆకట్టుకున్నాయి. మీ అల్లరి పనులు కొన్ని చెప్పండని జగపతిబాబు అడగ్గా.. “వద్దు సర్.. ఇప్పుడు నేను చెప్తే వాళ్లు తర్వాత ఇష్టమొచ్చినట్టు రాసేస్తారు.

మీరు నన్ను కలవడానికి జిమ్‌కు రండి. ‘రౌడీ’ జిమ్ ఒకటి ప్రారంభిస్తా. అందులో నేనే అందరికీ ట్రైనర్‌గా ఉంటా” అని బదులిచ్చింది. ఇక క్రష్ గురించి అడిగితే.. ‘మీ ఖాళీలను మీరే పూరించుకోండి’ అంటూ నవ్వేశారు. ఆ షోలో ఉన్న ప్రేక్షకుల వైపు చూస్తూ.. ‘మీలో ఎవరైనా విజయ్ అనే పేరున్నవాళ్లు ఉన్నారా?’ అంటూ ఆట పట్టించింది. ఇక రష్మిక సినిమాల విషయాని కొస్తే.. ఆమె ప్రస్తుతం ‘మైసా’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది.

రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతున్న చిత్రమిది. గోండ్ తెగల నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగభరిత యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక శక్తిమంతమైన గోండ్ యువతిగా కనిపించనుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తుండగా, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ పాన్‌ఇండియా మూవీగా నిర్మిస్తోం ది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా రష్మిక చేతిలో ఉన్నాయి.