calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

24-09-2025 12:02:32 AM

మధ్యంతర ఉత్తర్వులు జారీ  

ఢిల్లీ, సెప్టెంబర్ 23: సుప్రీంకోర్టులో మంగళవారం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై విచారణ జరిగింది.  జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. నిజాం ఆర్డర్ ఆధారంగా వీటిని గిరిజన గ్రామాలుగా పరిగణించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును నిలిపివేయడంతో పాటు 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపైనా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో పరమాత్మ, పూజారి సమ్మయ్యలు సవాల్ చేశారు.

రాష్ట్రపతి ఇచ్చిన షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్‌లో ఆ 23 గ్రామాలు లేవని 2013లో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నిజాం ఆర్డర్ ఆధారంగా ట్రైబల్ గ్రామాలుగా పరిగణించాలని  హైకోర్టు తీర్పు నిచ్చింది. నాన్ ట్రైబల్స్. 1950లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్‌లో ఆ 23 గ్రామాలు లేవని సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు.