30-01-2026 02:07:45 AM
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో 2012 నిబంధనలు
మార్చి 19న తదుపరి విచారణ
న్యూఢిల్లీ, జనవరి 29: ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన 2026 నిబంధనల అమలుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 2012 నాటి పాత నిబంధనలే అమల్లో ఉంటాయని స్ప ష్టం చేసింది. యూజీసీ కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై గురువారం విచారణ జరిపిన సీజేఐ సూర్యకాంత్, జస్టి స్ జాయ్ మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖలు చేసింది.
ఈ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని, వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందో ళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై తాము జోక్యం చేసుకోకపోతే, ఇది ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ‘కుల ఆధారిత వివక్ష’ అనే పదాన్ని కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకే పరిమితం చేశారని పిటిషనర్లు ఆరోపించారు.
దీనివల్ల జనరల్ కేటగిరీకి చెందిన వారికి ఎలాంటి వివక్ష ఎదురైనా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(1), 21లను ఉల్లంఘించడమేనని ఫిటిషనర్లు వాదించారు. వారి వాదనలు పరిగణ నలోకి తీసుకున్న ధర్మాసనం, సంపూర్ణ న్యాయం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ నిబంధనలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ప్రభుత్వానికి, యూజీసీకి నోటీసు జారీచేసింది.
సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?
విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (యూసీజీ) కొత్త నిబంధనలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ముఖ్యంగా జనరల్ కేటగిరీ విద్యార్థుల నుంచి విస్తృత నిరసనల మధ్య, నిబంధనలను పునఃపరిశీలించాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశించింది. దుర్వినియోగానికి గుర య్యేలా చేసే నిబంధనలలో ‘పూర్తి అస్పష్టత’ ఉందని పేర్కొంది. విచారణ సందర్భంగా, సీజీఐ సూర్యకాంత్ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా సమాజం కుల ఆధారిత వివక్షను తొలగించలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. ‘75 సంవత్సరాల తర్వాత, మనం సాధించిందల్లా, వర్గరహిత సమాజంగా మారడం. మనం సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా? ర్యాగింగ్‌లో జరుగుతున్న చెత్త విషయం ఏమిటంటే, దక్షిణం లేదా ఈశాన్య రాష్ట్రాలు ఇలా దేశంలోని వివి ధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు.
అలాంటి వారిని ర్యాగింగ్ పేరుతో కొందరు అవహేళన చేస్తుండడం అత్యంత బాధాకరం. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టళ్లు ఉండాలని మాట్లాడుతున్నారు. కానీ, ప్రస్తుత సమాజంలో కులాంతర వివాహాలే జరుగుతున్నాయి. హాస్టళ్లలోనూ అంద రరూ కలిసే ఉంటున్నారు. అలాగే ఐక్య భార త విధానం మన విద్యాసంస్థల్లో స్పష్టంగా ప్రతిబింబించాలి. విద్యా సంస్థల్లో స్వేచ్ఛాయుత, సమానత్వ, సమ్మిళిత వాతావరణా న్ని మేం కోరుకుంటున్నాం. అందరూ కలిసి ఉండే హాస్టళ్లలో కూడా మేము ఉన్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిబంధనల భాషను నిపుణుడిచే సమీక్షించబడాలని స్పష్టం చేస్తూ.. సుప్రీంకోర్టు కేంద్రానికి, యూజీసీకి నోటీసు జారీ చేసింది.