calender_icon.png 6 December, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌బీవీఆర్‌ఆర్ స్కూల్‌లో విజ్ఞాన్ మేళా

06-12-2025 12:00:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ పాఠశాలలో విజ్ఞాన్ మేళా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శ న్‌రెడ్డి, జి చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు రంగాలలో ముందుకు రావాలన్నారు. టెక్నాలజీని వాడుకొని విద్యా, ఇతర రంగాలలో పిల్లలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఏ ప్రవీణ్‌రెడ్డి, సెక్రటరీగా జి వెంక టరమణరెడ్డి, ట్రస్ట్ చైర్మన్ ఎస్ నవీన్‌రెడ్డి, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ పి జగత్‌రెడ్డి, ట్రెజరర్ ఎస్ సాయిరెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఏ సుజిత్‌రెడ్డి పాల్గొన్నారు. పది పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన వారికి మెడల్స్ అందజేశారు.