19-07-2025 12:23:08 AM
దేవరకొండ: మాజీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం దేవరకొండ పట్టణంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాజీ మంత్రి కృషితోనే రెండు మెడికల్ కాలేజీలు మంజూరు కావడం జరిగింది అని అన్నారు. ఆనాటి ఉద్యమ సమయం నుంచి నేటి వరకు బిఆర్ఎస్ పార్టీకి రథ సారధిగా వహించి జిల్లా రూపురేఖలను మార్చిన మహోన్నత వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి అని ఆయన అన్నారు.